IND vs NZ: రెండో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. సుందర్ ప్లేస్ లో ఎవరంటే..?

IND vs NZ: రెండో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. సుందర్ ప్లేస్ లో ఎవరంటే..?

ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. బుధవారం (జనవరి 13) రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో  న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

తొలి వన్డేలో గెలిచి ఊపు మీదున్న టీమిండియా రెండో వన్డేలోనూ గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా రెండో వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ లో మరోసారి అందరి కళ్ళు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. 

తొలి వన్డే ఆడుతూ గాయపడిన సుందర్ సిరీస్ లోని మిగిలిన రెండు మ్యాచ్ లను దూరమయ్యాడు. రెండో వన్డేలో సుందర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు. తొలి వన్డేలో బౌలింగ్ లో విఫలమైన భారత జట్టు ఈ మ్యాచ్ లో మెరుగవ్వాల్సి ఉంది. బ్యాటింగ్ లో అందరూ ఫామ్ లో ఉండడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం.