హాస్పిటల్ టాయిలెట్‌‌లో శిశువు మృతదేహం

హాస్పిటల్ టాయిలెట్‌‌లో శిశువు మృతదేహం

కూకట్‌‌పల్లి, వెలుగు: కూకట్‌‌పల్లిలోని రాందేవ్‌‌రావు హాస్పిటల్​ టాయిలెట్‌‌లో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. మంగళవారం సాయంత్రం దవాఖానలో ఆయాగా పనిచేసే నరసమ్మ గ్రౌండ్ ఫ్లోర్‌‌లోని ఓపీడీ లేడీస్ టాయిలెట్‌‌కు వెళ్లగా, అక్కడి ఇండియన్ టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్ వద్ద మగ శిశువు మృతదేహం కనిపించింది.

ఆమె వెంటనే హాస్పిటల్​ మేనేజ్​మెంట్​కు సమాచారం ఇచ్చింది. గుర్తు తెలియని మహిళ ప్రసవించిన అనంతరం శిశువు మృతదేహాన్ని టాయిలెట్‌‌లో పడేసి పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కూకట్‌‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.