రాష్ట్రంలో మరో 2,137 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో మరో 2,137 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,137 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,71,306 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కరోనా బారినపడి 8 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1033కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,192 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,39,700గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,573 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 24,019 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శనివారం 53,811 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 24,88,220 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 322, రంగారెడ్డి 182, మేడ్చల్ 146, కరీంనగర్ 132, నల్గొండ 124, సిద్ధిపేట్ 109, ఖమ్మం 90, వరంగల్ అర్బన్ 90, నిజామాబాద్ 72, మహబూబా బాద్ 72, సంగారెడ్డి 71, సంగారెడ్డి 65, సూర్యపేట్ 61, కామారెడ్డి 60, సిరిసిల్ల 57, భద్రాద్రి 51, పెద్దపల్లి 48 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

చనిపోవాలని డిసైడ్​ అయ్యా.. సోషల్​ మీడియాలో నిరుద్యోగి సెల్ఫీ వీడియో

కరోనా రికవరీల్లో అమెరికాను దాటేసిన ఇండియా

డాక్టర్లపై దాడిచేస్తే ఏడేళ్లు జైలు, 5 లక్షల ఫైన్