రాష్ట్రంలో మరో 2,216 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో మరో 2,216 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,216 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,57,096 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కరోనా బారినపడి 11 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 961కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,603 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,24,528గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 24,674 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శనివారం రాష్ట్రంలో 57,504 టెస్టులు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 341, రంగారెడ్డి 210, మేడ్చల్ 148, నల్గొండ 126, కరీంనగర్ 119, ఖమ్మం 105, వరంగల్ అర్బన్ 102, నిజామాబాద్ 84, సంగారెడ్డి 76, సూర్యపేట్ 76, సిద్ధిపేట్ 66, మహబూబా బాద్ 64, జగిత్యాల 56, సిరిసిల్ల 54, పెద్దపల్లి 52 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

క్రెడిట్ కార్డులపై ఫీజుల మోత.. రికవరీ కోసమేనంటున్న బ్యాంకులు

ఐపీఎల్‌లో తొలిసారి అమెరికన్‌ ప్లేయర్

జాబ్​ పోయినోళ్లకు కూడా సగం జీతం: లేబర్ మినిస్ట్రీ