రాష్ట్రంలో కొత్తగా 2,817 కరోనా కేసులు.. 10 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 2,817 కరోనా కేసులు.. 10 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,817 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,33,406 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 856కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,611 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,00,013గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,537 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. మరో 25,293 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. కాగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 15,42,978 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 59,711 పరీక్షలు చేయగా.. అందులో 2,817 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 452, రంగారెడ్డి 216, కరీంనగర్ 164, నల్గొండ 157, ఖమ్మం 157, మేడ్చల్ 129, సిద్ధిపేట్ 120, సూర్యపేట్ 116, వరంగల్ అర్బన్ 114, నిజామాబాద్ 97, భద్రాద్రి 89, జగిత్యాల 88, సంగారెడ్డి 76, పెద్దపల్లి 75, యాదాద్రి 73, మంచిర్యాల్ 71, మహబూబా బాద్ 62, కామారెడ్డి 62, సిరిసిల్ల 53 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

పనుల్లేక పస్తులుంటున్న అడ్డా కూలీలు

పదేండ్లలో ఈసారే తక్కువ బొగ్గు తవ్విన్రు

ఐఏఎస్ , ఐపీఎస్‌ల కోసం మిషన్ కర్మయోగి

25 కిలోమీటర్లు శవాన్ని మోసుకెళ్లిన ఐటీబీపీ జవాన్లు