నా భార్య అలిగింది.. సెలవు ఇవ్వండి

నా భార్య అలిగింది.. సెలవు ఇవ్వండి

తన భార్య అలకతీర్చేందుకు.. ఓ కానిస్టేబుల్ లీవ్ కోసం కష్టాలు పడుతున్నాడు. తనకు లీవ్ కావాలంటూ ఏఎస్పీకి లెటర్ రాశాడు. ఇప్పుడు కానిస్టేబుల్ రాసిన ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‭గా మారింది.  ఉత్తర ప్రదేశ్‭లో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లై నెలరోజులు కాకముందే భార్యను వదిలి వచ్చేశానని.. ఇప్పుడు తన భార్య అలిగిందని ఏఎస్పీకి లెటర్ రాశాడు. తాను కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని.. ఇంటికి వెళ్లి వస్తాను అంటూ కానిస్టేబుల్ లీవ్ అడిగాడు. 

2016 బ్యాచ్‭కు చెందిన గౌరవ్ చౌదరి అనే కానిస్టేబుల్ మౌ జిల్లాలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం మహారాజ్​గంజ్​ జిల్లాలోని నౌత్వానా పోలీస్​స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నాడు. గౌరవ్‌కు డిసెంబర్‌లో వివాహం జరిగింది. అనంతరం తన భార్యను ఇంటి వద్ద వదిలి వచ్చి.. డ్యూటీలో బిజీ అయ్యాడు. అయితే కొద్ది రోజుల తర్వాత లీవ్ పెట్టి వస్తానని భార్యకు చెప్పి వచ్చాడు. కాని ఇంటికి వెళ్లకపోవడంతో భార్య అలిగిందని... ఫోన్ చేసినా రెస్పాన్స్ అవ్వడం లేదని చెప్పాడు. అప్పుడుడప్పుడు ఫోన్ వాళ్ల అమ్మకు ఇచ్చేస్తోందని.. తన బాధను వివరిస్తూ లీవ్ కావాలని ఏఎస్పీకి లెటర్ రాశాడు. కానిస్టేబుల్ బాధను అర్థం చేసుకున్న ఏఎస్పీ 5 రోజుల పాటు లీవ్ ఇచ్చేందుకు అంగీకరించారు.