పాలిటిక్స్ లోకి స్మితా సబర్వాల్?!

పాలిటిక్స్ లోకి స్మితా సబర్వాల్?!
  • రిటైరయ్యాక ఆలోచిస్తానన్న ఐఏఎస్
  •  భవిష్యత్ ఇప్పుడే ఊహించలేం
  •  మెదక్ జిల్లాతో విడదీయలేని బంధం
  •  మంచి పనులు చేస్తేనే ప్రజాదరణ  
  • వైరల్ గా మారిన అధికారిణి కామెంట్స్

హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారిని రాజకీయాల్లోకి వెళ్లారా..? ఎక్కడి నుంచి బరిలో నిలుస్తారు..? ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు..? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన స్మితా పలు విషయాలను షేర్ చేసుకున్నారు. పాలిటిక్స్ లోకి వెళ్తారా..? అన్న ప్రశ్నకు భవిష్యత్ ను ఊహించలేమంటూ దాటవేసే సమాధానం చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లబోనని చెప్పకపోండం కొత్త చర్చకు ఆస్కారం ఇచ్చింది. తాను రిటైరయ్యాక పాలిటిక్స్  విషయం ఆలోచిస్తానన్నారు. అయితే మంత్రి సీతక్క ముందు కాలు మీద కాలేసుకొని కూర్చోవడంపై వస్తున్న విమర్శలకు ఆమె సమాధానం ఇచ్చారు. 

అలా కూర్చోవడం తన స్టయిల్ అని చెప్పారు. ఉమ్మడి మెదక్  జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో అమరవీరుల కుటుంబ సభ్యులను ఓదార్చే క్రమంలో కంటతడి పెట్టుకోవడంపై ప్రస్తావించగా తాను ఎమోషన్ అయ్యానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరమని తాను కూడా భావించానని చెప్పారు. మెదక్ జిల్లాతో విడదీయలేని బంధం ఉందని అన్నారు. మంచి పనులు చేస్తేనే ప్రజాదరణ లభిస్తుందని స్మిత తెలిపారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

త ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా ఉంటూ హెలికాప్టర్ లో వెళ్లి తనిఖీలు చేసిన స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు దీరాక అంత యాక్టివ్ గా లేరు. ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారని ప్రచారం జరిగింది.  ఆ తర్వాత ప్రభుత్వం ఆమెను  తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది స్మిత. ఇటీవల ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక  విషయాలను వెల్లడించారు. తనపై వచ్చే విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వనని, నిబద్దతతో పని చేసుకుంటూ వెళ్లానని స్మితా స‌బ‌ర్వాల్ వివరించారు.