
కోటి మంది పిల్లలకు కొత్త టెక్నాలజీపై శిక్షణకు సన్నాహాలు
రేపు అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా లాంచ్
హైదరాబాద్, వెలుగు: ఐబీ హబ్స్‌కు చెందిన నెక్ట్స్‌వేవ్ ఆర్థికంగా వెనుకబడిన కోటి మంది పిల్లలకు కొత్త టెక్నాలజీలపై ఉచితంగా శిక్షణ అందించనున్నట్టు ప్రకటించింది. ఇండస్ట్రీలకు అవసరమైన 4.0 ఎడ్యుకేషన్‌పై పిల్లలకు అన్ని రకాలుగా అవగాహన ఇవ్వనుంది. ఈ ప్రొగ్రామ్ కోసం దేశవ్యాప్తంగా ఐదో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలను ఐబీ హబ్స్ ఎంపిక చేస్తుంది. తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల్లో ఈప్రొగ్రామ్‌ను ఆఫర్ చేస్తుంది. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి(అక్టోబర్ 15) సందర్భంగా ఈ ప్రొగ్రామ్ తొలి బ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ ప్రొగ్రామ్ కింద ఫేస్ 1లో భాగంగా తెలంగాణలో 3 లక్షల మంది పిల్లలకు, ఏపీలో 4.5 లక్షల మందికి 4.0 ఎడ్యుకేషన్‌పై ట్రైనింగ్ అందిస్తామని నెక్ట్స్‌వేవ్ ప్రకటించింది.