నదుల అనుసంధానం ఆపండి..ఏపీకి ఎన్జీటీ ఆదేశం

నదుల అనుసంధానం ఆపండి..ఏపీకి ఎన్జీటీ ఆదేశం

హైదరాబాద్‌, వెలుగు: గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టును వెంటనే ఆపేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఏపీ సర్కారును సోమవారం ఆదేశించింది. కేంద్ర జలసంఘం, అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టడంపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ ఇతరులు వేసిన పిటిషన్ ను ఎన్జీటీ విచారించింది. పనులను పరిశీలించి నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని చెన్నైలోని ఎన్జీటీ రీజినల్‌ సెంటర్‌, సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (సీపీసీబీ)లను ఆదేశించింది. వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, సీబీసీలకు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 13 తేదీకి వాయిదా వేసింది.