ఆదేశాలు ఉల్లంఘిస్తే జైలుకే.. ఏపీకి ఎన్జీటీ హెచ్చరిక

ఆదేశాలు ఉల్లంఘిస్తే జైలుకే.. ఏపీకి ఎన్జీటీ హెచ్చరిక

రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాక్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. తమ ఆదేశాలను పట్టించుకోకుండా పనులు చేస్తుండడంతో జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పనులు ఆపాలని చెప్పింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామంటూ ఏపీ సీఎస్ ను హెచ్చరించింది ఎన్జీటీ చెన్నై ధర్మాసనం. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలోనే ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని పాలమూరు జిల్లా రైతు గవినోళ్ల శ్రీనివాస్  ధిక్కరణ పిటిషన్ దాఖలు చేవారు. ఎత్తిపోతల పనుల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది ఎన్జీటీ. తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది.