పద్మారావునగర్, వెలుగు: ఏపీ పోలీసులు ప్రైవేట్ వాహనాల్లో వచ్చి జర్నలిస్టు కేవీఆర్‌ను అరెస్ట్ చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.
పొరుగు రాష్ట్రం నుంచి తెలంగాణ పరిధిలోకి వచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్ నిర్వహించడాన్ని కమిషన్ నిశితంగా పరిశీలించింది. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన ప్రత్యక్ష దాడి అని న్యాయవాది రామారావు ఇమ్మానేని మండిపడ్డారు. బాడంగి ఎస్ఐపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, కేవీఆర్ కుటుంబానికి భద్రత కల్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరారు.
