
పద్మారావునగర్, వెలుగు: పెద్ద ధన్వాడ మానవ హక్కుల ఉల్లంఘన కేసులో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ణయించింది. దీంతో ఈ నెల 28న జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అధ్యయన కేంద్రం రూం నంబర్ 216, 219లో ఉదయం 10 గంటల నుంచి పబ్లిక్ హియరింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.