దావుద్ ఇబ్రహీంపై రివార్డు

దావుద్ ఇబ్రహీంపై రివార్డు

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం గురించి సమాచారం ఇస్తే..రూ. 25 లక్షలు రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు (NIA) ప్రకటించింది. అతడిని అరెస్టు చేసేందుకు సమాచారం ఇవ్వాలని సూచించింది. అతడితో పాటు అనుచరులైన చోటా షకీల్ పై రూ. 20 లక్షలు, హజి అనీస్ అలియాస్ అనీస్ ఇబ్రహీం షేక్, జావెద్ పటేల్ అలియాస్ జావెద్ చిక్నా, ఇబ్రహీం ముస్తక్ అబ్దుల్ రజాక్ మేమన్ అలియాస్ టైగర్ మెమన్ లపై రూ. 14 లక్షల చొప్పున రివార్డు ప్రకటిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. 1993లో ముంబాయి వరుస పేలుళ్ల ఘటనలో వీరు నిందితులుగా ఉన్నారు.

ఈ ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోగా... 700 మందికి పైగా గాయపడ్డారు. వీరిని అరెస్టు చేసేందుకు ఎన్ఐఏ అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తోంది. కానీ దావుద్ ఎక్కడున్నారో తెలియడం లేదు. పాక్ లో ఆశ్రయం పొందుతున్నట్లుగా భావిస్తున్నారు. పాక్ ఆధారంగా పని చేస్తున్న లష్కరే తోయిబా, జేషే మహ్మద్, అల్ ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్ర ముఠాలకు ‘డి కంపెనీ’ కీలక సహకారం అందిస్తున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ ‘డి కంపెనీ’ దావుద్ నిర్వహిస్తున్నారని సమాచారం.