
- ఎయిర్ పిస్టల్ స్వాధీనం
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ఓ యువకుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌లో బీఫార్మసీ చదువుతున్న బోధన్‌లోని అనీసానగర్‌కు చెందిన 20 ఏండ్ల యువకుడు ఇటీవల తన ఇంటికి వచ్చాడు.
అతడికి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ సభ్యులు బుధవారం ఉదయం ఐదు గంటలకు అతడి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో తనిఖీలు చేసి ఉగ్ర లింక్‌కు సంబంధించిన కీలక ఆధారాలతో పాటు ఎయిర్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు లోకల్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం, విచారణ కోసం హైదరాబాద్‌లోని రీజినల్ ఆఫీస్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.