గడ్డకట్టిన నయాగర జలపాతం

గడ్డకట్టిన నయాగర జలపాతం

అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. మైనస్ డిగ్రీల చలికి మంచినీరు కూడా గడ్డ కట్టుకుపోతోంది. మంచు తుఫాను ధాటికి..  గల గల పారే నయాగరా జలపాతం కూడా మూగబోయింది. జల సవ్వడులు లేక గడ్డకట్టుకుపోయింది. అందమైన నయాగారా ప్రస్తుతం  మంచుదిబ్బలను తలపిస్తోంది.  

అమెరికా, కెనడాల మధ్య ఉన్న నయాగారా జలపాతం అందాలు వర్ణణాతీతం.  నయాగరా జలపాతం అందాలు  తనివి తీరనివి. అలాంటి అద్భుత జలపాతం మంచు తుఫాను ధాటికి గడ్డకట్టుకుపోయింది. అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా  నయాగారా జలకళ దిగాలుగా మారింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవటంతో నయాగరా మంచు ముద్దగా మారింది.