గత 20 ఏళ్లలో సగటున 3.2 శాతం పెరిగిన నిఫ్టీ

గత 20 ఏళ్లలో సగటున 3.2 శాతం పెరిగిన నిఫ్టీ
  • ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు వెనకడుగు వేయడం, డీఐఐలు పుంజుకోవడమే కారణం 
  • ఈసారి కూడా పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తున్న మార్కెట్‌‌‌‌‌‌‌‌

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇంకో నెల రోజుల్లో కొత్త ఏడాదిలోకి ఎంటర్ అవుతాం. ఇప్పటికే  బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి. మరి 2022 లోని చివరి నెలలో మార్కెట్ ఎలా కదలబోతోంది?  సాధారణంగా మిగిలిన నెలలతో పోలిస్తే డిసెంబర్‌‌‌‌లో నిఫ్టీ ఎక్కువ రిటర్న్ ఇస్తోంది. ఈసారి కూడా ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటి వరకు  మంచి పెర్ఫార్మెన్సే చేసింది.  గత 20 ఏళ్ల డేటాను  గమనిస్తే,  ఈ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలను పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ముగించడానికి 80 శాతం అవకాశం ఉందని ఎంపెరికల్ డేటా పేర్కొంది. ఈ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిసెంబర్ నెలల్లో  సగటున 3.2 శాతం పెరిగిందని వివరించింది. ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జనవరి–డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చివరిలో  విదేశీ ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకుంటారని ఎంపెరికల్ తెలిపింది. ఫలితంగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చివరి 15 రోజుల్లో  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్కువ వాల్యూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కదులుతుందని వివరించింది.   దీంతో తమ నెట్ అసెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్యూ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏవీ) కి సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు డొమెస్టిక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (డీఐఐ) కు సులువవుతుంది. ఈ ఏడాది స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయిలకు చేరుకున్నప్పటికీ, ప్రస్తుతం దిగొస్తోంది. దీనికి తోడు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపును స్లో చేస్తాయనే అంచనాలు కూడా ఉండడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నెలలో పెరుగుతుందని ఎనలిస్టులు లెక్కలేస్తున్నారు. కారణం ఏదైనా కావొచ్చు కాని ప్రతీ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కదులుతుండడాన్ని గమనించాలి. ఇన్వెస్టర్లు ఈ ఒక్క కారణంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అవ్వకూడదు. టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫండమెంట్ ఎనాలసిస్ చేసి నిర్ణయాలు తీసుకోవాలి. 

ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌ను ప్రభావితం చేసే ఈవెంట్స్  చాలా ఉన్నాయి.  వారం ప్రారంభంలో చైనా, యూఎస్‌‌‌‌‌‌‌‌ల మాక్రో ఎకనమిక్ డేటా రిలీజ్‌‌‌‌‌‌‌‌ కానుంది. చైనా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ డేటా కూడా ఈ వారంలోనే విడుదల కానుంది.  లోకల్‌‌‌‌‌‌‌‌గా చూస్తే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ వివరాలు  ఈ నెల 7 న బయటకు రానున్నాయి. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వడ్డీ రేట్లను  వరుసగా మూడు సార్లు 50 బేసిస్ పాయింట్లు చొప్పున పెంచింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 7 % దిగువకు వచ్చింది కాబట్టి రానున్న ఎంపీసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతారనే అంచనాలు ఉన్నాయి.