తాజా ఆల్-టైమ్ హైకి నిఫ్టీ..సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ 150 పాయింట్లు అప్​

తాజా ఆల్-టైమ్ హైకి నిఫ్టీ..సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ 150 పాయింట్లు అప్​

ముంబై : బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఈక్విటీ ఇండెక్స్​లు బుధవారం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ తన తాజా రికార్డు ముగింపు స్థాయిని తాకింది.  పవర్, క్యాపిటల్ గూడ్స్,  ఇండస్ట్రియల్ స్టాక్‌‌‌‌‌‌‌‌లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. గ్లోబల్ ఈక్విటీలలో సానుకూల ధోరణి కనిపించింది.  అంతేకాకుండా, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్,  రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ఇండెక్స్-హెవీవెయిట్ కౌంటర్లలో భారీ రద్దీ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను పెంచిందని ట్రేడర్లు తెలిపారు.

30-షేర్ల బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ సెన్సెక్స్ 149.98 పాయింట్లు పెరిగి 76,606.57 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 593.94 పాయింట్లు పెరిగి 77,050.53 వద్దకు చేరుకుంది.  ఇది దాని మునుపటి జీవితకాల గరిష్ట స్థాయి 77,079.04ను అధిగమించడానికి కేవలం 28.51 పాయింట్ల దూరంలో ఉంది.   నిఫ్టీ 177.1 పాయింట్లు పెరిగి 23,441.95 వద్ద సరికొత్త ఆల్‌‌‌‌‌‌‌‌టైమ్ ఇంట్రా-డే గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది 58.10 పాయింట్లు పెరిగి 23,322.95 వద్ద కొత్త  గరిష్ట స్థాయి వద్ద ముగిసింది.   

ఏడాది కనిష్టానికి రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌

రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్  కిందటి నెలలో ఏడాది కనిష్టమైన 4.75 శాతానికి దిగొచ్చింది. రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ను కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 4.83 శాతంగా, కిందటేడాది మే నెలలో 4.31 శాతంగా రికార్డయ్యింది. ఈ ఏడాది మే నెలలో ఆహార పదార్ధాల ధరలను కొలిచే ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 8.69 శాతంగా ఉంది.  అంతకు ముందు నెలలో నమోదైన 8.70 శాతం నుంచి కొద్దిగా తగ్గింది. రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ గత కొన్ని నెలల నుంచి తగ్గుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.1 శాతానికి పెరిగిన సీపీఐ, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో  4.8 శాతానికి తగ్గింది. 

ఫ్లాట్‌‌‌‌‌‌‌‌గా యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌..

కిందటి నెలలో యూఎస్ రిటైల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 3.3 శాతం దగ్గర ఫ్లాట్‌‌‌‌‌‌‌‌గా నమోదయ్యింది. 3.4 శాతంగా రికార్డవుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు. నెల ప్రాతిపదికన చూస్తే యూఎస్‌‌‌‌‌‌‌‌ సీపీఐ 0.2 శాతంగా రికార్డయ్యింది.  ఈ ఏడాది ఫెడ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని అంచనా.