లైఫ్​ టైం హైకి నిఫ్టీ!

లైఫ్​ టైం హైకి నిఫ్టీ!
  •      22,126.80 స్థాయికి పరుగు
  •      సెన్సెక్స్ 440 పాయింట్లు అప్
  •       3.34 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

ముంబై :  రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్,  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌‌‌‌లో కొనుగోళ్లతో పాటు గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీతో శుక్రవారం ఇంట్రా-డే ట్రేడ్‌‌‌‌లో నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిని టచ్ చేసింది.    బీఎస్​ఈ సెన్సెక్స్ 440.33 పాయింట్లు  పెరిగి 72,086 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 1,444.1 పాయింట్లు పెరిగి 73,089.40కి చేరుకుంది. నిఫ్టీ 156.35 పాయింట్లు  ఎగిసి 21,854 వద్దకు చేరుకుంది. ఇంట్రాడేలో 429.35 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 22,126.80కి చేరుకుంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద 3.34 లక్షల కోట్లు పెరిగింది.  

సెన్సెక్స్ కంపెనీల్లో పవర్ గ్రిడ్, ఎన్‌‌‌‌టీపీసీ, టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, జేఎస్‌‌‌‌డబ్ల్యూ స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, లార్సెన్ అండ్ టూబ్రో, ఐటీసీ వెనకబడి ఉన్నాయి. ‘‘బడ్జెట్​మార్కెట్​పై నెగెటివ్​ ప్రభావాన్ని చూపలేదు.  ఎన్నికల ముందు ర్యాలీని కొనసాగించింది. ద్రవ్యలోటు లక్ష్యంలో భారీ పతనం బాండ్ రాబడులను తగ్గిస్తుంది. కార్పొరేట్ రుణ వ్యయాలనూ తగ్గిస్తుంది. పెట్టుబడులు పెరుగుతాయి’’  అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. బ్రాడ్​ మార్కెట్‌‌‌‌లో, బీఎస్​ఈ మిడ్‌‌‌‌క్యాప్ గేజ్ 0.80 శాతం  స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.49 శాతం పెరిగింది. ఇండెక్స్‌‌‌‌లలో ఆయిల్  గ్యాస్ 4.22 శాతం, ఎనర్జీ 3.44 శాతం, మెటల్ 2.95 శాతం, సర్వీసెస్ 2.22 శాతం, యుటిలిటీస్ 2.18 శాతం, ఐటీ 2.17 శాతం, పవర్ 1.81 శాతం పెరిగాయి.  ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌‌‌‌ఎంసీజీ, టెలికమ్యూనికేషన్  బ్యాంకెక్స్ వెనకబడి ఉన్నాయి. ఈవారంలో బీఎస్​ఈ బెంచ్‌‌‌‌మార్క్ 1,384.96 పాయింట్లు లేదా 1.95 శాతం పెరిగింది.  నిఫ్టీ 501.2 పాయింట్లు లేదా 2.34 శాతం పెరిగింది. ఆసియా మార్కెట్లలో, సియోల్  టోక్యో లాభాలతో స్థిరపడగా, షాంఘై  హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు గ్రీన్‌‌‌‌లో ట్రేడవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు గణనీయమైన లాభాలతో ముగిశాయి.  గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌కు 0.48 శాతం పెరిగి 79.08 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గురువారం రూ. 1,879.58 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.

దూసుకెళ్లిన రిలయన్స్​ షేర్లు 

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు శుక్రవారం భారీ డిమాండ్ కనిపించింది. ఈ షేర్​ 2 శాతానికి పైగా పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 41,860.54 కోట్లు పెరిగింది.  బీఎస్​ఈలో దేశంలోని అత్యంత విలువైన సంస్థ స్టాక్ 2.18 శాతం పెరిగి రూ.2,914.75 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 3.40 శాతం జంప్ చేసి రూ.2,949.90 వద్ద ఆల్ టైమ్ హైని తాకాయి. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలో 2 శాతం పెరిగి రూ.2,913కి చేరుకున్నాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.41,860.54 కోట్లు పెరిగి రూ.19,72,028.45 కోట్లకు చేరుకుంది. దీనితో, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్)లో రూ. 20 లక్షల కోట్ల మార్కును చేరుకోవడానికి కొద్దిదూరంలో ఆగింది. శుక్రవారం మార్కెట్ల రికవరీలో స్టాక్‌‌‌‌ ర్యాలీ కీలకంగా మారింది. కంపెనీకి చెందిన 6.54 లక్షల షేర్లు బీఎస్​ఈలో..  98.26 లక్షల షేర్లు ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఇలో  ట్రేడయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ షేరు 12.76 శాతం జంప్ చేసింది.