బెన్యూ నదిపై పడవ బోల్తా.. 70మందికి పైగా గల్లంతు

బెన్యూ నదిపై పడవ బోల్తా.. 70మందికి పైగా గల్లంతు

నైజీరియాలో జరిగిన ఓ భారీ పడవ ప్రమాదంలో దాదాపు 17 మంది మృతి చెందగా, 70 మందికి పైగా గల్లంతయ్యారు. స్థానిక అధికారుల ప్రకారం, పడవలో తారాబా రాష్ట్రంలోని ఆర్డో-కోలా జిల్లాలోని చేపల మార్కెట్ నుండి తిరిగి వస్తున్నండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో పడవలో 100మందికి పైగా ఉన్నట్టు సమాచారం.

నైజీరియాలోని అతిపెద్ద నదుల్లో ఒకటైన బెన్యూ నదిపై ఓడ బోల్తా పడింది. 14 మందిని రక్షించామని, 17 మంది మృతదేహాలను వెలికితీశామని, 73 మంది గల్లంతయ్యారని నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి లాడాన్ అయుబా తెలిపారు. ఈ ఘటనపై తారాబా గవర్నర్ అగ్బు కెఫాస్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జలాలు సంపదకు వనరుగా ఉండాలి.. కానీ మరణాలకు కాదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.