మెడికల్ రా మెటీరియల్ సరఫరా పేరుతో మోసం.. రూ.87 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు

మెడికల్ రా మెటీరియల్ సరఫరా పేరుతో మోసం.. రూ.87 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు

హైదరాబాద్ కి చెందిన ఓ మెడికల్ రిసర్చర్ను మోసం చేసిన ముఠాను హైదరాబాద్  సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ముంబాయి సెంటర్ గా కథను నడిపిన నైజీరియన్ విన్సెంట్ ఇబాదువేవే, ముంబయికి చెందిన షకీల్, సైఫుల్లాఖాన్,అరవింద్ మిశ్రా లను అరెస్ట్ చేసి వారి నుంచి 6 ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ కి తరలించినట్లు సైబర్ క్రైం డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం... జీరియాకి చెందిన క్రిస్టోఫర్ హైదరాబాద్ లో నివసిస్తు డాక్టర్ ఆర్తూర్ విలియమ్స్ గా పేరు మార్చి లెక్సో ఫార్మా అనే ఫేక్ కంపెనీ పేరుతో తార్నాకకు చెందిన మెడికల్ రిసర్చర్కు మెయిల్ పంపారు. భారత్ నుంచి యూఎస్ కి ముడి పదార్థాలు అవసరమున్నాయని, వాటిని సరఫరా చేయడం ద్వారా రూ. కోట్లు సంపాదించవచ్చని ఆశ చూపారు. నైజీరియన్ చెప్పిన మాట నమ్మి మౌనిక శర్మ అనే మధ్యవర్తి ద్వారా 3 రా మెటీరియల్ ప్యాకెట్లను కొన్నారు. మళ్లీ ఎక్కువ మొత్తంలో మెటీరియల్ కావాలనడంతో రీసెర్చర్ రూ.87.45 లక్షలు వారికి చెల్లించాడు. 

మోసపోయానని గుర్తించి.. ఫిర్యాదు

ఎక్కడో తేడా కొట్టడంతో మోసపోయినట్లు గుర్తించి బాధితుడు పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  జీరియాలో ఉండే క్రొస్టోఫర్ మెయిల్స్ ని ఆపరేట్ చేస్తూ విన్సెంట్ ఇబాదువేదేనే ఈ చీటింగ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీసా గడువు ముగియడంతో అతనికి పాస్ పోర్ట్ కూడా లేదని దర్యా్ప్తులో తెలిసింది. ముంబయిలో ఉంటున్న అతడు ఇలాంటి మోసాలకు తరచూ పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మొదట ముగ్గురిని అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు నైజీరియన్ వ్యక్తి మొబైల్ వాడకపోవడంతో అతన్ని పట్టుకోవడం కష్టతరమైంది. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా విన్సెంట్ కదలికలను గుర్తించారు. ముంబయి పోలీసుల సహకారంతో నలాసోపరా అనే ప్రాంతంలో నైజీరియన్ ని అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకువచ్చారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.