పెళ్లి పేరుతో 10 లక్షలు కొట్టేసిన నైజీరియన్

V6 Velugu Posted on Aug 03, 2021

తెలుగు మాట్రిమోనియల్‌లో యువతిని పరిచయం చేసుకొని 10 లక్షల రూపాయలు కాజేసిన నైజీరియన్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన ఓ యువతి తెలుగు మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్‌ని అప్డేట్ చేసింది. ఓషర్ ఎబుక విక్టర్ అనే నైజీరియన్ తెలుగు మ్యాట్రిమోనీలో యువతి ప్రొఫైల్ చూసి తన ప్రొఫైల్ నచ్చిందని రిప్లైయి ఇచ్చాడు. తాను యూఎస్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు.
 
తాను ఇండియా రావడానికి వీసా..గుజరాత్ లో ఇల్లు కొన్నానని దాని రేనవేషన్ కోసం అంటూ పలు దఫాలుగా 10 లక్షలు తీసుకుని మోసం చేశాడు. అసలు విషయం తెలుసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ లో నైజీరియన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Tagged Hyderabad, Nigerian cheats, Rs 10 lakh, marriage

Latest Videos

Subscribe Now

More News