మహారాష్ట్ర సహా 5 రాష్ట్రాల్లో ఆంక్షలు

మహారాష్ట్ర సహా 5 రాష్ట్రాల్లో ఆంక్షలు

ముంబై/న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో రూల్స్ ను స్ట్రిక్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ ను విధించింది. హోటల్స్, టాకీసులు 50 శాతం సీట్లతోనే నడవాలని ఆదేశించింది. వేడుకల్లో 100 మంది మాత్రమే పాల్గొనాలని చెప్పింది. యూపీ, హర్యానాల్లోనూ శనివారం నుంచే నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. గుజరాత్ లోని 9 నగరాల్లో నైట్ కర్ఫ్యూ టైమింగ్స్ ను ప్రభుత్వం పొడిగించింది. ఇంతకుముందు రాత్రి 1 గంట నుంచి కర్ఫ్యూ ఉండగా, ఇకపై రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. ఒడిశాలో క్రిస్మస్ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. జనవరి 2 వరకూ ఆంక్షలు ఉంటాయని, వేడుకల్లో 50 మందికి మించి పాల్గొనొద్దని ఆదేశించింది. మధ్యప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు రాకున్నా, ముందు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూ విధించారు.