
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా లొకేషన్‌లోని చిరంజీవి స్టిల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో స్మైలింగ్ ఫేస్‌తో ఇంప్రెస్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో జరుగుతోన్న ఈ సాంగ్‌ను చిరంజీవి, నయనతారలపై నైట్ ఎఫెక్ట్‌లో చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్‌కు విజయ్ పొలాకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇదే షెడ్యూల్‌లో మరో పాటను కూడా చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.
అలాగే అక్టోబర్‌లో జరిగే మేజర్ షెడ్యూల్‌లో వెంకటేష్ జాయిన్ అవబోతున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపుగా పూర్తి కానుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.