యుద్ధరంగంలోకి నైట్ విజన్ యుద్ధ ట్యాంకులు!

యుద్ధరంగంలోకి నైట్ విజన్ యుద్ధ ట్యాంకులు!
  •      సంగారెడ్డి ఓడీఎఫ్​కు వర్క్ ఆర్డర్

సంగారెడ్డి, వెలుగు : త్వరలోనే యుద్ధరంగంలోకి నైట్ విజన్ ట్యాంకులు అడుగుపెట్టబోతున్నాయి. రాత్రి వేళల్లో కటిక చీకట్లో దాక్కున్న శత్రువులను గుర్తించి దాడి చేసే నైట్​విజన్​యుద్ధ ట్యాంకులను తయారు చేయాలంటూ సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఉన్న ఓడీఎఫ్​ఫ్యాక్టరీకి ఆర్డర్​వచ్చింది. గురువారం ఢిల్లీలో ఓడీఎఫ్​(ఏవీఎన్ఎల్) సీఎండీ సంజయ్ ద్వివేది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకొని వాటి పత్రాలను అందజేశారు. 

ఇప్పటికే సంగారెడ్డి ఓడీఎఫ్​ ఫ్యాక్టరీ అధునాతన బీఎంపీ-2 యుద్ధ ట్యాంకులను తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే యుద్ధ ట్యాంకుల్లో కొన్ని అధునాతన మార్పులు చేస్తే బాగుంటుందని కేంద్ర రక్షణ శాఖ ఆలోచించింది. అందులో భాగంగానే నైట్ విజన్ ఎనేబిలిటీతో రూపొంందించాలని రూపొందించాలని సూచించింది. ఈ ట్యాంకుకు ఫైర్ కంట్రోల్ సిస్టం కూడా ఏర్పాటు చేయనున్నారు.