
హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్, ఈ-కామర్స్ రంగంలో పనిచేస్తున్న హైదరాబాద్ కంపెనీ నిహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్ రూ.10 కోట్ల రైట్స్ ఇష్యూను ప్రకటించింది. ఈ నిధులను తమ వ్యాపార విస్తరణ కోసం ఉపయోగిస్తారు. కంపెనీ తెలంగాణలో ఉన్న ఫుల్ఫిల్మెంట్ నెట్‌వర్క్‌ను తమిళనాడు, మహారాష్ట్రలకు విస్తరిస్తుంది. సబ్సిడరీ లైఫ్108 హెల్త్‌కేర్ విస్తరణలో భాగంగా సొంతంగా ఈ-ఫార్మసీ పోర్టల్‌ను ప్రారంభించి, ప్రైవేట్ లేబుల్ హెల్త్ సప్లిమెంట్లను తీసుకువస్తుంది.
ఈవెంట్ మేనేజ్మెంట్, కంటెంట్ క్రియేషన్ సేవలు అందించే బీస్ట్‌బెల్స్ మీడియా పాడ్‌క్యాస్ట్ రంగంలోకి అడుగుపెడుతోంది. కంపెనీ సొంతంగా www.onvo.in (హోమ్, కిచెన్ ఉత్పత్తులకు) www.goldensilver.in (లైఫ్‌స్టైల్, గిఫ్టింగ్) పోర్టల్‌లను ప్రారంభించి ప్రైవేట్ లేబుల్ బ్రాండ్లను ప్రమోట్ చేయనుంది. ఈ విస్తరణ ప్రణాళికల ద్వారా కంపెనీ తన మార్కెట్ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని, ఆదాయ వనరులను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.