బాటా బ్రాండ్ అంబాసిడర్ గా నిహారిక

బాటా బ్రాండ్ అంబాసిడర్ గా నిహారిక

హైదరాబాద్​, వెలుగు: ఫుట్​వేర్​ బ్రాండ్​ బాటా ఇండియా తన 'బ్రైటర్​ మోమెంట్స్​' కలెక్షన్ ప్రచారం కోసం నటి నిహారిక ఎన్​ఎంను బ్రాండ్​ అంబాసిడర్​గా ఎంచుకుంది. 

హైదరాబాద్​లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో పండుగ సందడిని తీసుకొచ్చింది.  ఈ సందర్భంగా మాల్ ఆవరణలో ఇంటరాక్టివ్ గేమ్స్, పండుగ పోటీలు, ప్రత్యక్ష కార్యక్రమాలను నిర్వహించింది. బాటా స్టోర్ వద్ద నిహారిక అభిమానులను కలిసి, కొత్త కలెక్షన్​ను పరిశీలించారు.  

'బ్రైటర్​ మోమెంట్స్​' ప్రచారం, తమ గ్లోబల్ "మేక్ యువర్ వే" ప్రచారానికి అనుగుణంగా ఉంటుందని బాటా తెలిపింది. ఈ కొత్త ప్రొడక్టుల ధర రూ. 799 నుంచి మొదలవుతుంది.