ఇవాళ హైదరాబాద్ కు నిఖత్ జరీన్

ఇవాళ హైదరాబాద్ కు నిఖత్ జరీన్

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ప్రపంచ విజేతగా నిలిచిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వస్తుండడంతో ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్ర 6గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న నిఖత్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలకనున్నారు. కాగా టర్కీ ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్స్ లో 52కేజీల విభాగంలో థాయ్ లాండ్ బాక్సర్ ను ఓడించి స్వర్ణాన్ని అందుకుని తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది. 

ఇప్పటికే జూనియర్ ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్..ఇప్పుడు సీనియర్ స్థాయిలోనూ తొలిసారి టైటిల్ ను ముద్దాడి కొత్త చరిత్ర లిఖించింది. రింగ్ లో శివంగిలా చెలరేగి ప్రజల మనసులను గెలుచుకుంది. ఇక మహిళల బాక్సింగ్ లో భారత్ కు ఇప్పటివరకు ఆరుసార్లు స్వర్ణ పతాకం దక్కించుకుంది. మేరికోమ్, సరితాదేవి, ఆర్.ఎల్ జెన్ని, లేఖ ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. ఇప్పుడు ఆ జాబితాలో నిఖత్ జరీన్ కూడా చేరింది.

మరిన్ని వార్తల కోసం

గీతాంజలి శ్రీకి బుకర్ ప్రైజ్

పొల్యూషన్ సిటీగా మారుతున్న హైదరాబాద్