పొల్యూషన్ సిటీగా మారుతున్న హైదరాబాద్

పొల్యూషన్ సిటీగా మారుతున్న హైదరాబాద్

ప్రపంచంలోని 100 అత్యంత కాలుష్య నగరాల్లో 60కి పైగా భారత్ లోనే ఉన్నట్టు లేటెస్ట్ రిపోర్ట్ చెబుతోంది. స్విట్జర్లాండ్ కు చెందిన IQ ఎయిర్ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2021 లో హైదరాబాద్ లో కాలుష్య స్థాయి పెరిగింది. దేశంలోని ఆరు అత్యంత కాలుష్య నగరాల్లో మొదటి స్థానంలో ఢిల్లీ ఉండగా..ఆ తర్వాత కోల్ కత్తా, ముంబై, హైదరాబాద్, బెంగుళూరు, చైన్నై ఉన్నాయి. దీంతో దేశంలోని ఏ నగరం కూడా గాలి నాణ్యత ప్రమాణాలను అందుకోలేక పోతోంది.

వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 ప్రకారం..హైదరాబాద్ లో పీఎం 2.5 స్థాయిలు దాటి పెరిగాయి.  2020లో 34.7 నుంచి 2021 లో 39.4 కి పెరిగాయి. గత డిసెంబర్ లో అత్యధికంగా కాలుష్యం నమోదైంది.  వాహనాల నుంచి వచ్చే పొగే 20 నుంచి 35 శాతం పార్టికల్ మ్యాటర్ కాలుష్యం పెరగడానికి కారణమవుతోంది. రోజు రోజుకీ వాహనాలు కొంటున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో కాలుష్య స్థాయి మరింత పెరుగుతోందని రిపోర్ట్ తెలిపింది. హైదరాబాద్ లో మొత్తం జనాభాలో 90 శాతం మందికి...60 లక్షల దాకా వాహనాలు ఉంటాయని నివేదిక తెలిపింది.

హైదరాబాద్ నగరంలో కల్తీ పెట్రోల్, డీజిల్ వాడకం, పరిశ్రమలు నుంచి వెలువడే పొగ, చెత్త తగలబెట్టడం, పెద్ద పెద్ద భవనాల నిర్మాణం లాంటివి కాలుష్యానికి కారణమంటున్నారు పర్యావరణ వేత్తలు.2003 నుంచే హైదరాబాద్ పొల్యూషన్ సిటీగా మారుతోంది. అప్పటి నుంచి ప్రభుత్వాలు కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. యాక్షన్ ప్లాన్ పెట్టుకొని పనిచేస్తే తప్ప వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తల కోసం

పెంపుడు కుక్కతో వాకింగ్​ కోసం స్టేడియం ఖాళీ

అప్పటిదాకా నావలి రిజర్వాయర్ కట్టొద్దు..!