Ghatikachalam Trailer: సస్పెన్స్‌‌‌‌‌‌‌ థ్రిల్లర్‌గా ‘ఘటికాచలం’ ట్రైలర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

Ghatikachalam Trailer: సస్పెన్స్‌‌‌‌‌‌‌ థ్రిల్లర్‌గా ‘ఘటికాచలం’ ట్రైలర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

నిఖిల్ దేవాదుల హీరోగా అమర్ కామెపల్లి తెరకెక్కించిన చిత్రం ‘ఘటికాచలం’.ఎం.సి.రాజు ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కథను అందించారు. దర్శకుడు మారుతి, నిర్మాత SKN ఈ నెల 31న సినిమాను విడుదల చేస్తున్నారు. శుక్రవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ ‘నేను చైల్డ్ ఆర్టిస్టుగా 70 సినిమాలకుపైగా నటించాను. హీరోగా నాకిది ఫస్ట్ మూవీ. ఇందులో నా క్యారెక్టర్ చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. ఒక్కో మూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి ఒక్కోలా బిహేవ్ చేసే పాత్రలో  కనిపిస్తా’అని చెప్పాడు.

డైరెక్టర్ అమర్ మాట్లాడుతూ  ‘ఇది ‘బొమ్మరిల్లు’లాంటి సినిమా. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలుంటాయి’అని అన్నాడు. నిర్మాత ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేఎన్ మాట్లాడుతూ ‘ఎంగేజ్ చేస్తూనే చివరలో మంచి మెసేజ్ ఇచ్చే చిత్రమిది.

హారర్ మూవీస్ ఇష్టపడే  ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎక్కువమంది ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చేలా మన ఇండస్ట్రీ పెద్దలు ఆలోచనలు చేయాలి’అని అన్నారు. నటులు జోగి నాయుడు, రంగధామ్, షాన్,  సినిమాటోగ్రాఫర్ ఎస్ఎస్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.