
డిఫరెంట్ స్ర్కిప్టులతో పాటు చాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. తన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ‘ కోసం నెల రోజులు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు. దీనికోసం నిఖిల్ వియత్నాం వెళ్లాడు. అక్కడ ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోనున్నాడు. సైగాన్‌లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్‌లు యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నిఖిల్‌కి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో తను ఒక యోధునిగా కనిపించడం కోసం ఫిజికల్‌గానూ మేకోవర్ అవుతున్నాడు. నిఖిల్ నటిస్తున్న 20వ చిత్రమిది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.