
నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం..‘స్పై’ (Spy). ఈ మూవీ స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్(Subhas Chandra Bose) మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా తెరకెక్కించారు.
భారీ అంచనాలతో నేడు(జూన్ 29న) రిలీజ్ అయినా ‘స్పై’ మూవీ నేతాజీ జీవితంలోని పలు కీలక ఘట్టాల ఆధారంగా నిర్మించారు. నేతాజీ డెత్ మిస్టరీ వెనక ఉన్న రహస్యాలను దర్యాప్తు చేసే RAW ఏజెంట్ 'జై' అనే పాత్రలో నిఖిల్ నటించాడు. సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. స్పై సినిమాపై పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
ఈ మూవీలో నిఖిల్ ఇండియాకి చెందిన రీసెర్చ్ అనాలసిస్ కు ఏజెంట్. గ్లోబల్ టెర్రరిస్ట్ ఖదీర్ ఖాన్(నితిన్ మెహతా)ని ట్రేస్ చేసి అంతమొందించే వర్క్ ను నిఖిల్ కు అప్పగిస్తారు. అంతకంటే ముందే ఇదే మిషన్ లో భాగమైన నిఖిల్ అన్న క్యారెక్టర్ లో చేసిన ఆర్యన్ రాజేష్ ఖదీర్ ఖాన్ ను అంతమొందించడానికి మిషన్ లో దిగుతాడు..అక్కడ ఆర్యన్ రాజేష్ మిస్టరీగా చనిపోవడం.. ఖదీర్ ఖాన్ అసలు ఎక్కడ ఉంటాడో.. తెలుసుకోవడం కోసం నిఖిల్ బయలుదేరుతాడు.
అదే సమయంలో రా హెడ్ క్వార్ట్రర్స్ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైల్ మిస్ అవుతుంది. ఈ క్రమంలో అసలు జై సుభాష్ ను చంపింది ఎవరు అనేది తెలుసుకున్నాడా? ఖదీర్ ఖాన్ ను ట్రేస్ చేశాడా? నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైల్ ని వెనక్కు తెచ్చాడా? అనేదే సినిమా కథ.
హీరో యాక్షన్ పార్ట్, RAW ఏజెంట్ గా నిఖిల్ కనిపించడం ఈ సినిమాకు ప్రధాన బలం. డైరెక్టర్ స్క్రీన్ ప్లే పైన ఇంకాస్త ఫోకస్ చేసి ఉంటే 'స్పై’ మూవీ మరో లెవెల్ ఉండేది. డైరెక్టర్ గ్యారీ బి.హెచ్(Garry Bh) డైరెక్టర్ గా తీస్తున్న తొలి మూవీ అయినా చాలా బాగా తెరకెక్కించాడు. ఈ మూవీకు మెయిన్ అట్రాక్షన్ శ్రీ చరణ్, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్. ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ డేవిడ్(David) సినిమాటోగ్రఫీ మరో లెవెల్లో ఉందంటూ ఆడియన్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాలతో రిలీజ్ అయినా ‘స్పై’ (Spy) మూవీ ఈ వీకెండ్ లో ఎన్ని కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాలి.