నిఖిల్ హీరోగా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో నటిస్తున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సినిమా కోసం నిఖిల్ పడిన కఠోర శ్రమను చూపించారు.
సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు. విజయ్ కామిశెట్టి డైలాగులు అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
