బర్త్ డే స్పెషల్..నిఖిల్ స్వయంభు నుంచి కొత్త పోస్టర్

బర్త్ డే స్పెషల్..నిఖిల్ స్వయంభు నుంచి కొత్త పోస్టర్

యంగ్ హీరో నిఖిల్ కొత్త మూవీ స్వయంభు. భరత్ కృష్ణమాచారి డైరెక్షన్  చేస్తున్న ఈ మూవీ చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. ఇవాళ  నిఖిల్ బర్త్ డే సందర్భంగా మ్యాసీవ్ ఎపిక్ పోస్టర్ రిలీజ్- చేశారు.  త్వరలో టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

నిఖిల్ 'కార్తికేయ 2' పాన్ ఇండియా స్థాయి విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. స్వయంభు నిఖిల్ కు   20వ మైల్ స్టోన్ మూవీ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ  గ్రాండ్-స్కేల్ హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ మూవీ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చిత్రంలో నిఖిల్‌ మునుపెన్నడూ చూడని అవతార్ లో ఒక లెజెండరీ యోధునిగా కనిపిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ని టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాన్-ఇండియా విజన్ తో రూపొందిస్తున్నారు.

ALSO READ | ‘క’ సినిమాలో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? జాబ్కు రిజైన్ ఇచ్చే ఆలోచన ఉంటే ఇది చదవండి..

స్వయంభు టీం నిఖిల్ పుట్టినరోజున పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. నిఖిల్, సంయుక్త యుద్ధ నేపథ్యంలో కనిపించిన ఈ పోస్టర్‌ అదిరిపోయింది. నిఖిల్ యుద్ధం మధ్యలో కత్తి పట్టుకుని యోధుడిలా పవర్ ఫుల్ గా కనిపించారు. అతని పక్కన, సంయుక్త విల్లు  బాణంతో నిలబడి టార్గెట్ ని చేరుకున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది. ఈ పోస్టర్ సినిమా గ్రాండ్ స్కేల్ ని ప్రజెంట్ చేస్తోంది.  

నభా నటేష్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించగా, కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్, రవీంద్ర ప్రొడక్షన్ డిజైనర్లుగా పనిచేస్తున్నారు.