అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ

అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ

భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ 2024 లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేయనున్నట్లు  ప్రకటించారు.‘ నేను నిక్కీ హేలీని. నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను" అని ఓ వీడియోలో తెలిపారు. జో బిడెన్ రెండోసారి పదవికి అర్హులు కాదని నిక్కీ హేలీ అన్నారు.  ఇప్పటికే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ  తరపున పోటీ చేస్తానని చెప్పారు.  దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి  నిక్కీ హేలీ డొనాల్డ్ ట్రంప్ కు పోటీగా మారనున్నారు .నవంబర్ 5, 2024న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

నిక్కీ హేలీ 2004లో మొదటిసారి ఎన్నికల్లో గెలిచారు. 2010లో కాలిఫోర్నియా గవర్నర్ గా ఉన్నారు.  ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారిగా పనిచేశారు. సౌత్  కాలిఫోర్నియా గవర్నర్ గా నియమితులైన మొదటి మహిళగా  రికార్డ్ సృష్టించారు. నిక్కీ హేలీ అసలుపేరు  నిమ్రత నిక్కీ రంధవా. ఆమె తండ్రి అజిత్ సింగ్ రంధవా, తల్లి రాజ్ కౌర్ రంధవా.  వాళ్ల నాన్న అమృత్‌సర్‌ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.  అమె తండ్రి గతంలో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, తల్లి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందారు.