భారత్ను చైనాలా ప్రత్యర్థిగా చూడొద్దు.. రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ

భారత్ను చైనాలా ప్రత్యర్థిగా చూడొద్దు.. రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ

న్యూయార్క్: భారత్ ను చైనా వంటి ప్రత్యర్థిలా చూడొద్దని రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇండియన్ అమెరికన్ లీడర్ నిక్కీ హేలీ అన్నారు. విలువైన భాగస్వామిగా పరిగణించాలని ఆమె సూచించారు. భారత్ తో సంబంధాలు క్షీణిస్తున్న వేళ వాటిని సరిదిద్దడానికి అమెరికా చర్యలు చేపట్టాలన్నారు. 

బుధవారం న్యూస్ వీక్ మ్యాగజైన్ కు ఆమె ఓ కాలమ్ రాశారు. చైనాను అధిగమించడం, బల ప్రయోగం ద్వారా శాంతిని సాధించడం కంటే భారత్, అమెరికా సంబంధాలను తిరిగి పట్టాలెక్కించడంపైనే అమెరికా దృష్టిసారించాలని కోరారు. భారత్​తో సంబంధాలను నాశనం చేసుకోవడం వ్యూహాత్మక విపత్తు అవుతుందన్నారు.