ఇజ్రాయెల్ పై దాడి వెనుక ఇరాన్, రష్యా, చైనా... నిక్కీ హేలీ

ఇజ్రాయెల్ పై దాడి వెనుక ఇరాన్, రష్యా, చైనా... నిక్కీ హేలీ

న్యూఢిల్లీ: పోయినేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి వెనుక ఇరాన్, రష్యా, చైనా దేశాలు ఉన్నాయంటూ అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ లీడర్ నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు చేశారు. ఆ మూడు దేశాల సహకారంతోనే హమాస్ అటాక్ చేసిందని ఆమె తెలిపారు. ఒకవేళ తాము అలర్ట్ గా లేకపోతే, అలాంటి దాడి తమ దేశంలోనూ జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇజ్రాయెల్ మీడియాతో నిక్కీ హేలీ మాట్లాడారు.

‘‘ఇజ్రాయెల్ పై హమాస్ దాడికి ఇరాన్ ప్లాన్ చేసింది. అందుకు రష్యా ఇంటెలిజెన్స్ సహకారం అందించింది. ఈ ఆపరేషన్ కు చైనా నిధులు సమకూర్చింది. చైనా ఇచ్చిన నిధులతో హమాస్ మిలిటెంట్లకు ఇరాన్ శిక్షణ ఇచ్చింది. ఇదంతా హమాస్ పని కాదు. ఇరాన్, రష్యా, చైనా కలిసి చేసిన పని. వీళ్లంతా హంతకులు” అని ఆమె అన్నారు. అయితే, తన ఆరోపణలకు బలం చేకూర్చే ఎలాంటి ఆధారాలను ఆమె చూపించలేదు. కాగా, హమాస్ చేసిన టెర్రర్ అటాక్​లో
1,200 మంది చనిపోయారు.