అందమైన ప్రేమకథగా నిలవే

అందమైన ప్రేమకథగా నిలవే

సౌమిత్ రావు హీరోగా నటిస్తూ సాయి వెన్నంతో కలిసి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నిలవే’.  శ్రేయాసి సేన్ హీరోయిన్.  గిరిధర్ రావు పోలాటి,  సాయి వెన్నం నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సౌమిత్ రావు మాట్లాడుతూ ‘ఓ మంచి మ్యూజికల్ లవ్ డ్రామాగా ఈ చిత్రం రాబోతోంది.  

అంతా కొత్త వాళ్లం కలిసి చేస్తున్నాం.   నిజాయితీకి అర్థం ఉంటే అది మా ‘నిలవే’ సినిమా. ఈ చిత్రం అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది’ అని అన్నాడు.  దర్శకుడు సాయి వెన్నం మాట్లాడుతూ ‘మాది చిన్న టీం కావొచ్చు. కానీ మా కాన్సెప్ట్, మా సినిమా చాలా పెద్దగా ఉంటుంది. 

ఇదొక అందమైన ప్రేమ కథ. ఓ వ్యక్తి జీవితంలో జరిగే ప్రయాణమే ఈ చిత్రం’ అని చెప్పాడు.  మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్, కెమెరామెన్ దిలీప్ కే కుమార్, లిరిక్ రైటర్స్ ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి.ఎస్. భరద్వాజ్, కోటి మాట్లాడారు.