నిమ్స్​లో పిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్లు

నిమ్స్​లో పిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్లు

హైదరాబాద్​, వెలుగు: నిమ్స్​లో వారం రోజుల పాటు చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లను చేయనున్నారు. చార్లీస్ హార్ట్​ హీరోస్​ క్యాంప్​ పేరుతో బ్రిటన్​కు చెందిన డాక్టర్ల బృందం.. ఈ నెల 24 నుంచి 30 వరకు ఆపరేషన్లు నిర్వహించనుంది. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు గుండెలో రంధ్రం, ఇతర గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లను చేస్తారని నిమ్స్​ డైరెక్టర్​ బీరప్ప ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 

బ్రిటన్ డాక్టర్​ రమణ దన్నపునేని ఆధ్వర్యంలో పది మంది డాక్టర్ల టీమ్​తోపాటు నిమ్స్  కార్డియో థొరాసిక్ విభాగం హెడ్​ అమరేశ్వర రావు టీం, నీలోఫర్​ ఆసుపత్రి డాక్టర్లు కూడా ఆపరేషన్లలో పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు 040 -23489025 నంబర్​కు ఫోన్​ చేయొచ్చన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫోన్​ లైన్ అందుబాటులో ఉంటుందన్నారు.