నిమ్స్ దవాఖానలో దారుణం .. బాత్రూమ్ మ్యాన్ హోల్లో 5 నెలల శిశువు డెడ్ బాడీ

నిమ్స్ దవాఖానలో దారుణం .. బాత్రూమ్ మ్యాన్ హోల్లో  5 నెలల శిశువు డెడ్ బాడీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: నిమ్స్ దవాఖానలో దారుణ ఘటన వెలుగు చూసింది. వాష్ రూమ్ కమోడ్ లో 5 నెలల శిశువు డెడ్ బాడీ లభ్యమైంది. ఆర్థోపెడిక్ డిపార్ట్​మెంట్​సమీపంలోని పాత ఓపీ రూమ్​నంబర్​19 వద్ద మహిళల కోసం వాష్ రూమ్ ఏర్పాటు చేశారు. అయితే  గురువారం బాత్​రూమ్​లో వాటర్ జామయ్యింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు పారిశుధ్య కార్మికులు  మధ్యాహ్నం1.30  గంటలకు వెళ్లారు. 

వాష్ రూమ్ కు లింక్ ఉన్న  మ్యాన్ హోల్ తెరిచి చూడగా, ఒక కాలు కనిపించింది. మ్యాన్ హోల్ ను పూర్తిగా తెరిచి చూడగా సుమారు  ఐదు నెలల మగ శిశువు మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం  ఇచ్చారు. శిశువు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ పని చేసిందెవరు? ఎప్పుడు  పడేసి వెళ్లిపోయారు అన్నది తెలుసుకోవడానికి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. నిమ్స్‌‌ దవాఖానలోని గైనకాలజీ, మాతాశిశు సంరక్షణ విభాగాల్లో పరిశీలన చేస్తున్నారు.