క్లోరోక్విన్ ను ఇష్టం వచ్చినట్లు వేసుకోవద్దు..

V6 Velugu Posted on Apr 09, 2020

గాలినుంచి కరోనా వైరస్ సోకదు అని అనుకోవద్దని, గాలినుంచి కూడా వైరస్ సోకే ముప్పు కొంత వరకు ఉంటుందని , నిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హెచ్ ఓడీ డాక్టర్ బీరప్ప అన్నారు. క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు అందరూ వేసుకోవాల్సిన అవసరం లేదని, డాక్టర్ సూచనల మేరకే వాడాలని సూచించారు. మన దేశానికి కరోనా ముప్పు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన్ను ‘వీ6వెలుగు’ ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు..

వీ6 వెలుగు: శానిటైజర్లు, మాస్క్ లు అందరికీ అవసరమా? సబ్బుతో చేతులు కడుక్కున్నా సరిపోతుందా?

డాక్టర్: మాస్కులు అవసరం లేదని మొదట్లో మేమే చెప్పాం. గాలి నుంచి కరోనా సోకదని అనుకు న్నాం. కానీ, గాలి నుంచీ వస్తుందన్న అంచనాలతో అందరూ  మాస్క్ లు  వేసుకోవాలని చెబుతున్నాం. హాస్పిటళ్లలో  పనిచేసే వాళ్లకి రిస్క్  ఎక్కువ కాబట్టి అందరూ తప్పనిసరిగా వేసుకోవాలి. ఇంట్లో ఉండేటోళ్లకు అవసరం లేదు. బయట చాలా మంది  కొన్ని నల్లటి మాస్కులు వాడుతున్నారు. వాటితో పెద్దగా ఉపయోగం లేదు. ఎంత పెట్టి కొనుక్కున్నా నెలల తరబడి వాడొద్దు. అన్నీ వాడి పారేసేవే. ఎన్ 95 మాస్కులు వాడితే వైరస్ నుంచి రక్షించుకోవచ్చు. వంద శాతం కాపాడే డబుల్, ట్రిపుల్ లేయర్ మాస్క్ లు  మన దగ్గ ర లేవు. చేతులను శానిటైజర్ తో   శుభ్రం చేసుకోవాలని లేదు. సబ్బుతో కడుక్కున్నా సరిపోతుంది. పేషెంట్ నుంచి 3 మీటర్ల దూరం వరకే వైరస్ పోతుందన్న దాంట్లో నిజం లేదు.

గర్భిణులు తరచూ చెకప్ కు  వెళ్లాలా? డయాబెటిస్ పేషెంట్లకు ప్రాణాంతకమా?

అలాగని ఏమీ లేదు. సమస్యలుంటే గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లాలి. షుగర్ ఉన్నోళకు కరోనా ఎఫెక్ట్ కొంచెం ఎక్కువే. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బం దేమీ ఉండదు. కేవలం ఎక్సర్సైజ్, వాకింగ్ తోనో అది నయం కాదు కదా. యోగా, చిన్న చిన్న ఎక్సర్ సైజ్ లతో  దాన్ని సప్లిమెంట్‌‌‌‌ చేసుకోవచ్చు.

హెల్త్ ప్రొఫెషనల్స్, పోలీసులు, మీడియా వాళ్లు తమ హెల్త్ ను ఎట్లా రక్షించుకోవాలి?

డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ ప్రతి పేషెంట్నుఒక సస్పెక్ట్ కిందే చూడాలి. ముందే జాగ్రత్తపడాలి. పోలీసులు, మీడియావాళ్లు, బయటపని చేసే ఉద్యోగులు మాస్కులు, గ్లౌస్లు వేసుకుంటే సరిపోద్ది.

కమ్యూనిటీ ట్రాన్స్‌‌‌‌మిషన్ స్టార్టయిందా?

కమ్యునిటీ ట్రాన్స్మిషన్ మొదలైందో లేదో ఇప్పుడే చెప్పలేం. లాక్ డౌన్  ఈ ప్రమాదం తప్పిందనే చె ప్పొచ్చు. అయితే ఇప్పటితో ఆగుతుందని మాత్రం చెప్పలేం. వేరే దేశాలతో పోలిస్తేమనం చాలా బెటర్ . అమెరికాలో, మన దేశంలో ఒకేసారి వైరస్ స్టార్ట యింది. కానీ అక్కడ ఎక్కువుంది.. ఇక్కడ అంత లేదు. ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ కాబట్టి, వైరస్లోని ప్రొటీన్ బ్రేకయ్యే తీవ్రత తగ్గుతుంది. మే చివరి నాటికి సౌతిండియాలో తగ్గే చాన్స్ ఉంది.

అమెరికాలో టెస్టింగ్‌ ఫెసిలిటీ ఎక్కువుంది కాబట్టే కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని, మన దగ్గర ఆ ఫెసిలిటీ లేదు కాబట్టే తక్కువగా రికార్డవుతున్నాయంటున్నారు కదా? విదేశాల నుంచి ఇండియాకు 16 లక్షల మంది వస్తే 35 వేల మందికే టెస్టులు చేశారుగా?

నిజమే. టెస్టులెక్కువ చేస్తే ఎక్కువ నమోదవొచ్చు. అలాగని లక్షణాలు లేకుండా టెస్టులు చేయలేం. కొందరిలో వైరస్ సోకినా తక్కువ లక్షణాలే ఉంటాయి. అందువల్ల విదేశాల నుంచి వచ్చిన వాళ్లు, పేషెంట్లతో కాంటాక్ అయిన వాళ్లు  తప్ప కుండా 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. చైనా, స్పెయిన్, ఇటలీ, ఇరాన్, అమెరికాలో కరోనా లక్ష ణాలు ఎక్కువగా కనిపిస్తున్నయి. కానీ ఇండియాలో అలాంటి లక్షణాలతో పేషెంట్లు పెద్దగా హాస్పిటళ్లకు  రావడం లేదు.

వైరస్ వచ్చిన వారిలో 50 శాతం మందికి లక్షణాలు బయట పడవు అంటున్నారు కదా.. వారితో వేరేవాళ్లకు స్ప్రెడ్‌ అవుతుందా?

మైల్డ్‌ సింప్టమ్స్‌‌‌‌ ఉన్నవాళ్లంతా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లు.. మన దగ్గరి వాళ్లకు అలాంటి లక్షణా లు కనిపించలేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో లక్షణాలు ఉన్నా లేకున్నాసెల్ఫ్‌గా క్వారంటైన్‌‌‌‌ అయిపోవాలే. వైరస్‌‌‌‌ లక్షణాలు 14 రోజుల పాటు కనిపించవు.. అప్పటి వరకు వాళ్లు ఇంట్లోనే ఉండిపోవాలి.

క్వారంటైన్‌‌‌‌లో ఉన్నవాళ్లు ఇల్లంతా తిరుగుతున్నారు.. వారితో ఇంట్లో వాళ్లకు వైరస్‌‌‌‌ వస్తుంది కదా? క్వారంటైన్‌‌‌‌లో ఉన్న వాళ్లు విడిగానే ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు ఎవరూ ఉపయోగించొద్దు. కరోనా లక్షణాలు ఎలా ఉంటాయి?

దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్‌‌‌‌ ఉంటాయి, కొందరిలో సింప్టమ్స్‌‌‌‌ కనిపించవు.. కొందరు విపరీతంగా దగ్గి బాడీలో ఆక్సిజన్‌‌‌‌ తగ్గి కింద పడిపోతారు.

కరోనా పేషెంట్‌ ఇంట్లో ఉన్న వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 

ఇంట్లోవాళ్లు కనీసం మూడు ఫీట్ల దూరం ఉండాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇంట్లో ఉన్న వాళ్లు తప్పనిసరిగా ఎన్95 మాస్క్‌‌‌‌లే పెట్టుకోవాలి.

కరోనా ఎఫెక్ట్‌‌‌‌ ఎవరిపై ఎక్కువగా ఉంటుంది?

చిన్నపిల్లలు, వృద్ధులకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకే  వస్తుందని, యంగ్‌‌‌‌గా ఉన్నవాళకు రాదు అనే అపోహ ఉంది. అది నిజం కాదు.. వైరస్‌‌‌‌ ఎవరికైనా ఎఫెక్ట్ కావొచ్చు. ఇటలీలో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎఫెక్ట్ డ్  పీపుల్‌‌‌‌ ఆ ఏజ్‌‌‌‌ గ్రూప్‌ వాళ్ ఉలే న్నా రు. ఇండియాలో గతంలో అనేక వైరస్‌‌‌‌లను ఫేస్ చేసిన అనుభవం ఉంది. చికెన్‌‌‌‌పాక్స్‌‌‌‌, స్మాల్‌‌‌‌పాక్స్‌‌‌‌ లాంటివి చూశాం. మనకు ఇమ్యూనిటీ పవర్‌‌‌‌ ఎక్కువ. ప్రభావం కొంత తక్కువగా ఉండవచ్చు.

వైరస్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌, స్టీల్‌‌‌‌, న్యూస్‌‌‌‌ పేపర్లపై ఎంతసేపు ఉంటుంది? దీనిపై ఏవైనా స్టడీస్‌‌‌‌ ఉన్నాయా?

కాపర్‌‌‌‌ మీద తక్కువగా ఉంటుంది.. స్టీల్‌‌‌‌ మీద 10 గంటలు ఉంటుంది అనేవన్నీ అపోహలే. అవన్నీ పుకార్లే. వాటిపై  స్టడీస్ అంటూ ఏమీ లేవు. అన్ని వస్తువులను శుభ్రం చేసుకుని వాడుకోవాలి. ఎక్కడ ఎంతసేపు ఉంటుంది అనేది కచ్చితంగా తెలియదు.

కొందరు ఆల్కహాల్ దొరకట్లేదని పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? ఇంకొన్ని రోజులు దొరక్కపోతే వాళ్లు ఆల్కహాలిక్‌‌‌‌ ఫ్రీ అవుతారా? లేక వాళ్లకుఏదైనా ట్రీట్‌‌‌‌మెంట్‌ అవసరమా?

రోజూ మందు తాగేవాళ్లకు అది లేకపోతే చీమలు, తేళ్లుపాకినట్టు అనిపిస్తుంది. దాన్ని విత్ డ్రావల్ సింప్టమ్స్ అంటారు. వాళకు ఆస్పత్రిలోనే  ట్రీట్మెంట్ ఇప్పించాలి.

Tagged v6 velugu, Doctor, nims, about coronavirus, beerappa, special interview with, surgical gastroenterology

Latest Videos

Subscribe Now

More News