IND vs SA: రేపటి (డిసెంబర్ 9) నుంచి ఇండియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు

IND vs SA: రేపటి (డిసెంబర్ 9) నుంచి ఇండియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు

ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ కు రంగం సిద్ధమైంది. మూడు ఫార్మాట్ లలో భాగంగా టెస్ట్ సిరీస్ ను సౌతాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా విజయం సాధించి టెస్ట్ సిరీస్ ప్రభావానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ రెండు జట్ల మధ్య మంగళవారం (డిసెంబర్ 9) నుంచి 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కటక్ వేదికగా బారబత్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. టీ20ల్లో దూసుకుపోతున్న టీమిండియా ఈ సిరీస్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ ముందు ఇండియా ఆడుతున్న కీలక సిరీస్ ఇది. 
    
ఇండియా, సౌతాఫ్రికా ఐదు మ్యాచ్ ల షెడ్యూల్:
 
డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14 న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17 న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. ఆసియా కప్ తో పాటు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలుచుకొని టీమిండియా కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు సౌతాఫ్రికా టీమిండియాకు సొంతగడ్డపై షాక్ ఇవ్వాలని చూస్తోంది.    


టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:

ఐదు టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. టాస్ 6:30 గంటలకు వేస్తారు. 

లైవ్ టెలికాస్ట్:  స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఐదు టీ20 మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది

లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్ లో లైవ్ చూడొచ్చు.

భారత క్రికెట్ జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్)*, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్-కీపర్), సంజు శాంసన్ (వికెట్-కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ 

సౌతాఫ్రికా స్క్వాడ్:

ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, మార్కో జాన్సెన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), డోనోవన్ ఫెరీరా (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, ఒట్నీల్ బార్ట్‌మాన్, కేశవ్ మహారాజ్,క్వాన్ మఫాకా, లుంగీ ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జ్ 

►ALSO READ | ఫార్ములా వన్ నయా చాంపియన్ నోరిస్