అబుదాబి: ఫార్ములా వన్ (ఎఫ్ 1) రేసింగ్‌లో మెక్‌లారెన్ టీమ్ డ్రైవర్ లాండో నోరిస్ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. తొలిసారి ఎఫ్1 వరల్డ్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. లూయిస్ హామిల్టన్ తర్వాత ఎఫ్1 టైటిల్ గెలిచిన బ్రిటన్ డ్రైవర్‌గా నోరిస్ రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన సీజన్ ఎండింగ్ అబుదాబి రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ (1:26:07.469 సె) టాప్ ప్లేస్‌తో సొంతం చేసుకున్నాడు. నోరిస్ (+16.572 సె) మూడో ప్లేస్‌లో నిలిచినా.. మొత్తంగా 408 పాయింట్లతో టైటిల్ సొంతం చేసుకున్నాడు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో వెర్‌స్టాపెన్ (రెడ్ బుల్–396), రన్నరప్‌గా నిలవగా.. ఆస్కార్ పియాస్ట్రి(మెక్‌లారెన్–392) మూడో ప్లేస్‌తో సరిపెట్టాడు.
