
- ఇప్పటికే సిక్స్, ఫోర్ లేన్ల రోడ్లు పూర్తి చేసిన హెచ్ఎండీఏ
- ప్రత్యేక ఆకర్షణగా ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ఫ్లైఓవర్
- త్వరలో ప్రారంభానికి సన్నాహాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు:కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌ను హెచ్ఎండీఏ సూపర్గా డెవలప్ చేస్తున్నది. సుమారు మూడేండ్ల కింద 530 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఇక్కడ లేఅవుట్ వేసి ప్లాట్లను విక్రయించింది. ఎన్నో కంపెనీలు నియోపోలిస్‌లో భూములను కొనడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఎకరం రూ.100 కోట్ల వరకు పలకడంతో కోకాపేట పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో మార్మోగింది. దీంతో అందరి దృష్టి కోకాపేట్లేఅవుట్పైనే పడింది.
నియోపోలిస్ అని పిలిచే ఈ లేఅవుట్లో ప్రస్తుతం పెద్దసంఖ్యలో హైరైజ్భవనాలు నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇందులో పలు ఎంఎన్సీలు, ఐటీ సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయని అధికారులు చెప్తున్నారు. హైటెక్ సిటీ తర్వాత మరో కీలక ప్రాంతంగా నియోపోలిస్ మారడం ఖాయమంటున్నారు. అందుకే మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ఫోకస్ పెట్టారు.
నాలుగు, ఆరు లేన్ల రోడ్లు పూర్తి..
ఇప్పటికే ఆరు, నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణం కంప్లీట్కాగా, సెంట్రల్ ల్యాండ్ స్కేపింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇంటర్నల్ రోడ్లతోపాటు డ్రైనేజీ లైన్ల నిర్మాణానికి ప్లాన్లు సిద్ధం చేశారు. అండర్ గ్రౌండ్ కరెంట్ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే హైటెక్ సిటీని తలదన్నే రీతిలో నియోపోలిస్సిద్ధమవుతుందంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఔటర్ రింగ్ రోడ్‌కు కనెక్టివిటీ ఉండడంతో ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ లేఅవుట్లో 530 ఎకరాల్లో 9 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ఆఫీస్లు, మల్టీపర్పస్స్పేస్అందుబాటులోకి వస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మారనున్న స్వరూపం
నియోపోలిస్ లేఅవుట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ట్రంపెట్ ఇంటర్ చేంజ్ఫ్లై ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఓఆర్ఆర్ను కలుపుతూ నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావడంతో అధికారులు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. పటాన్చెరు, శంషాబాద్ రూట్లతో ఓఆర్ఆర్ను కలుపుతూ ట్రంపెట్ నుంచి ఎంట్రీ, ఎగ్జిట్లను నిర్మించారు. రెండు ఎంట్రీ ర్యాంపులు, రెండు ఎగ్జిట్ ర్యాంపులను ఈ సింగిల్ ట్రంపెట్ఫ్లై ఓవర్లో నిర్మించారు. టోల్‌ప్లాజా వరకు ఐదు ఎగ్జిట్, మూడు ఎంట్రీ లైన్లను నిర్మించారు. దాదాపు 65 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
పటాన్చెరు నుంచి కోకాపేటకు.. అలాగే కోకాపేట లేఅవుట్నుంచి గచ్చిబౌలి, శంషాబాద్ వరకు గచ్చిబౌలి నుంచి కోకాపేట లేఅవుట్అండ్ కోకాపేట లేఅవుట్ నుంచి పటాన్‌చెరుకు కనెక్టివిటీ ఇవ్వడమే దీని ఉద్దేశమంటున్నారు. ఈ ప్రాంతాల్లో మెయిన్రోడ్లపై సాఫీగా వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు3 కిలోమీటర్ల దూరంలోనే ఈ ట్రంపెట్ ఫ్లైఓవర్ నిర్మించారు. ఓఆర్ఆర్పై ప్రస్తుతం 21 ఇంటర్‌చేంజ్‌లు ఉండగా, 22వ ఇంటర్ చేంజ్‌గా నియో పోలిస్ ట్రంపెట్నుంచి ఓఆర్ఆర్కు కనెక్ట్ చేశారు.