నీరవ్ కు నో బెయిల్: ఇస్తే పారిపోతారన్న బ్రిటన్ కోర్టు

నీరవ్ కు నో బెయిల్: ఇస్తే పారిపోతారన్న బ్రిటన్ కోర్టు

స్కాట్లాం డ్ యార్డ్​ పోలీసు ల అదుపులోఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బ్రిటన్ కోర్టులో రెండోసారీ చుక్కె దురైంది. శుక్రవారం అతడికి బెయిల్ నిరాకరించిన వెస్ట్​మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు..పిటిషన్ ను కొట్టేసిం ది. అధికా రులకు లొంగిపోకుండా తప్పిం చుకు తిరుగుతారనేందుకు ఆధారాలు న్నాయని, అందుకే బెయిల్ ఇచ్చేది లేదని కోర్టు చీఫ్ మెజిస్ట్రేట్ ఎమ్మా ఆర్బత్నాట్ అన్నారు. దక్షిణ పసిఫిక్ మహా సంద్రంలో ఎక్కడో మూలకు ఉన్న వనువతు అనే ఐలాండ్ దేశ పౌరసత్వం కోసం నీరవ్ మోడీ దరఖాస్తు చేసుకున్నారని, ఇండి యాకు చిక్కకుండా పారి పోయేందుకే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసు కున్నట్టు అర్థమవుతోందని జడ్జి వ్యాఖ్యానిం చారు.విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేశారు. జైలు నుంచే వీడియో లిం కు ద్వారా విచారణ జరగనుంది. భారత్‌‌ తరఫున వాదించిన క్రౌన్ ప్రాసిక్యూష న్ సర్వీ స్ (సీపీఎస్ ).. నీరవ్ కు బెయిలిస్తే పారి పోయే ముప్పు ఉందని కోర్టుకు విన్నవించిం ది. ‘ప్రధాన సాక్షి అయిన ఆశిష్​ లాడ్ ను నీరవ్ మోడీ బెదిరించాడు. తప్పుడు సాక్ష్యం చెబితే 20 లక్షలు ఇస్తానంటూ ఎరవేశాడు. నీలేశ్ మిస్త్రీతో మరో ముగ్గు రు సాక్షులకూ అలాంటి బెదిరింపులే వెళ్లాయి . వారిని భయపెట్టి కేసులో పత్రాలు, హార్డ్​డి స్క్​లు, సర్వర్లను నాశనం చేయించారు’ అని పేర్కొంది. వాదనలు విన్న కోర్టు..బెయిల్ తిరస్కరించింది. అంతకుముందు తొలిసారి జిల్లా జడ్జి​ కూడా నీరవ్ కు బెయిల్ తిరస్కరించారు.