ఇలాంటి న్యాయవాదుల వల్లే అత్యాచారాలు పెరిగిపోతున్నాయ్ : నిర్భయ తండ్రి

ఇలాంటి న్యాయవాదుల వల్లే అత్యాచారాలు పెరిగిపోతున్నాయ్ : నిర్భయ తండ్రి

సుప్రీం కోర్ట్ న్యాయవాది ఇంధిరా జైసింగ్ లాంటి వారివల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని నిర్భయ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్భయ దోషులైన వినయ్, పవన్, అక్షయ్, ముఖేష్ లకు ఫిబ్రవరి 1న ఉరితీయాలని ఢిల్లీ కోర్ట్ డెత్ వారెంట్ జారీ చేసింది.

డెత్ వారెంట్ పై నేపథ్యంలో ప్రముఖ సుప్రీం కోర్ట్ న్యాయవాది ఇంధిరా జైసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “నిర్భయ తల్లి ఆవేదనను అర్ధం చేసుకోగలను. కానీ రాజీవ్ హత్య కేసులో నళనిని సోనియాగాంధీ ఎలా క్షమించారో..నిర్భయ దోషుల్ని అలాగే క్షమించాలని” అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు.

ఇలాంటి న్యాయవాదుల వల్లే అత్యాచారాలు పెరిగిపోతున్నాయ్ : నిర్భయ తండ్రి

అయితే ఇంధిరా జైసింగ్ వ్యాఖ్యలపై నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్షపడాలని దేశం మొత్తం ఎదురు చూస్తుందన్నారు. ఇలాంటి వ్యక్తుల వల్లే అత్యాచారం కేసులో దోషులకు శిక్షపడడం లేదన్నారు.

అత్యాచార దోషులకు ఇందిరా మద్దతు ఇవ్వడం ద్వారా జీవనోపాది పొందుతున్నారని నిర్భయ తండ్రి బద్రినాద్ అన్నారు. అలాంటి వారివల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్న ఆయన..మరో మహిళ బాధల్ని  సుప్రీం న్యాయవాది ఇందిరా అర్ధం చేసుకోవడం లేదన్నారు .