నామినేషన్ల ప్రక్రియను జాగ్రత్తగా పూర్తిచేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నామినేషన్ల ప్రక్రియను జాగ్రత్తగా పూర్తిచేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
  • కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను జాగ్రత్తగా పూర్తిచేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ గ్రామీణ మండలంలోని కొండాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన వారితో మాట్లాడి కేంద్రంలో అన్ని వసతులు ఉన్నాయో లేవో తెలుసుకున్నారు. అభ్యర్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. సిబ్బందితో మాట్లాడుతూ.. హెల్ప్ డెస్క్​లో అందుబాటులో ఉంటూ, అభ్యర్థులకు కావాల్సిన సమాచారం ఇవ్వాలని సూచించారు. 

ఖచ్చితంగా సమయపాలన పాటించాలన్నారు. క్లస్టర్ లో ఇప్పటి వరకు దాఖలైన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేయాలన్నారు. రోజువారీగా నామినే షన్ల వివరాలన్నీ తమకు అందజేయాలన్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. డీపీవో శ్రీనివాస్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో గజానన్, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.