ధాన్యం నిల్వలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

ధాన్యం నిల్వలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి :  నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా
  •  నిర్మల్​ కలెక్టర్ భవేశ్​మిశ్రా

నిర్మల్, వెలుగు: రైతుల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలని, నిల్వ విషయంలో జాప్యం జరగకుండా అదనపు స్థలాలను సిద్ధం చేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, గోదాముల లభ్యత, రవాణా సౌకర్యాలపై సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు లేదా గోదాములకు తరలించాలని సూచించారు. అనంతరం నిర్మల్​ పట్టణంలో భారీ మారథనాన్​ నిర్వహించారు. 

అనంతరం ఎన్టీఆర్​ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జనగణనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వీయ గణనపై పౌరులందరికీ పూర్తి అవగాహన ఉండాలన్నారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఆన్‌‌‌‌లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్న కల్యాణి, డీఏవో అంజిప్రసాద్​, సీపీవో జీవరత్నం, డీవై ఎస్​వో శ్రీకాంత్ రెడ్డి, డీఈవో భోజన్న, సివిల్​సప్లై అధికారులు పాల్గొన్నారు. 

కొనుగోళ్లను స్పీడప్​ చేయాలి

నస్పూర్, వెలుగు: ధాన్యం కొనుగోలు ప్రక్రియ స్పీడప్ చేయాలని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని గుడిపేట, సబ్బపల్లి, గొల్లపల్లి, పెద్దంపేట, దొనబండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శుక్రవారం హాజీపూర్ తహసీల్దార్ పుష్పలతతో కలిసి సందర్శించారు.  జిల్లాలో ఇప్పటివరకు 12 రైస్ మిల్లులు పనిచేస్తున్నాయని, 6 గోదాములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.