- కలెక్టర్ భవేశ్ మిశ్రా
కుంటాల, వెలుగు: గడువులోగా ధాన్యాన్ని గోదాంలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కుంటాల మండలంలోని అర్లి ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఆంజనేయ రైస్ మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కల్లూర్, బూర్గుపల్లిలోని కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. జూన్ 7 వరకు కొనుగోళ్లు పూర్తి చేసి ధాన్యం గోదాంలకు తరలించాలని ఆదేశించారు.
అనంతరం ధాన్యం నిల్వలు, గన్నీ సంచుల కొరత, లారీల ఏర్పాటు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తదితర అంశాలపై కల్లూర్ గ్రామపంచాయతీలో అధికారులతో చర్చించారు. అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, డీఎస్ వోలు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీవో వనజ తదితరులు పాల్గొన్నారు.
