సోయా టోకెన్ కోసం రైతుల తిప్పలు..రాత్రంగా క్యూలైన్ లో పడిగాపులు

సోయా టోకెన్ కోసం రైతుల తిప్పలు..రాత్రంగా క్యూలైన్ లో పడిగాపులు

నిర్మల్​ జిల్లాలో రైతుల తిప్పులు అంతా ఇంతాకావు.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు నిద్రాహారాలు మానాల్సిన పరిస్థితి నెలకొంది. కుబీర్, తానూర్​ వ్యవసాయ  సహకార సంఘాల ఆఫీసుల  సోయా టోకెన్​ సెంటర్లలో క్యూలైన్లలో రైతులు నిద్రపోయిన దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..

శనివారం( నవంబర్1) రాత్రి నుంచి నిర్మల్​ జిల్లాలోని కుబీర్​, తానూర్​ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల దగ్గర సోయా టోకెన్​ కోసం రైతులు పడిగాపులు పడ్డారు. రాత్రంతా టోకెన్​ సెంటర్ల దగ్గర క్యూలైన్లో నిద్రపోవాల్సిన దుస్థితి వచ్చింది. టోకెన్ ఎప్పుడు ఇస్తారో తెలియన పరిస్థితుల్లో రైతులు చెప్పులు క్యూలైన్​ లో పెట్టి అక్కడే ఎదురు చూస్తూ కూర్చున్నారు. అధికారులు స్పందించి టోకెన్లు ఇచ్చి వెంటనే సోయా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.