నిర్మల్, వెలుగు: నిర్మల్ రూరల్, సారంగాపూర్, సోన్, దిలావర్పూర్, నర్సాపూర్(జి), కుంటాల, లోకేశ్వరం మండలాల్లో రెండో విడత పంచాయతీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులపై పీవోలకు పలు సూచనలు చేశారు. పోలింగ్మెటీరియల్డిస్ట్రిబ్యూషన్సెంటర్లకు సిబ్బంది సమయానికి చేరుకోవాలన్నారు. సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక పక్కాగా జరగాలని సూచించారు.
మొదటి విడత ఎన్నికల ప్రక్రియ విజయవంతమైందని, అధికారులందరూ అదే స్ఫూర్తితో పని చేసి రెండో విడతను పూర్తి చేయాలన్నారు. అడిషనల్కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, జడ్పీ సీఈవో శంకర్ తదితరులు పాల్గొన్నారు.

